jagan: జగన్ పై దళిత దండయాత్ర ప్రారంభిస్తాం: కారెం శివాజీ

  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కేంద్రం నీరుగారుస్తోంది
  • దీనిపై జగన్ ఇంతవరకు స్పందించలేదు
  • పవన్, వామపక్షాలు కొత్త డ్రామాకు తెర తీశారు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. కేంద్రం తీరుపై దేశంలోని అనేక రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారని... కానీ, ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోకుండా ఉన్న జగన్ పై దళిత దండయాత్రను చేస్తామని చెప్పారు. గుంటూరులో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వామపక్షాలు కలసి కొత్త డ్రామాను మొదలు పెట్టాయని ఎద్దేవా చేశారు.


jagan
karem shivaji
Chandrababu
sc st atrocity acto
sc st atrocity act
  • Loading...

More Telugu News