Sai: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సాయి పల్లవి అందుకే గ్లామర్ పాత్రలు చేయదట!
  • మహేశ్ చిత్రానికి భారీ ఎత్తున ప్రీమియర్ షోలు 
  • పాట చిత్రీకరణలో రవితేజ 'నేల టికెట్టు' 

 *  ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గ్లామరస్ పాత్రలు చేయనని చెబుతోంది. తనను సినిమాలలో నటించడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడమే గొప్ప విషయమని, అలాంటప్పుడు అలాంటి గ్లామర్ పాత్రల్లో నటించి వారి మనసు నొప్పించనని చెబుతోంది.
*  మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం కోసం అమెరికాలో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 19న సుమారు 2000 ప్రీమియర్ షోలను అమెరికాలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
*  రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేల టికెట్టు' చిత్రం పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. రాజు సుందరం నేతృత్వంలో గండిపేటలోని స్కై జోన్ ట్రాంపోలిన్ పార్కులో ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.   

  • Loading...

More Telugu News