rangasthalam: ‘రంగమ్మత్త’ అనసూయ ఇచ్చిన విందు బాగుంది: కాస్ట్యూమ్ డిజైనర్ గౌరినాయుడు

  • రంగమ్మత్త విందుభోజనం బాగుంది
  • ఈ విందుకు రంగస్థలం గ్రామస్థులు హాజరయ్యారు
  • ఓ ట్వీట్ చేసిన ‘రంగస్థలం’ అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గౌరినాయుడు  

ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంలో నటించిన అనసూయకు మంచి పేరు వచ్చింది. అనసూయ పోషించిన ‘రంగమ్మత్త’ పాత్రపై ప్రేక్షకుల మన్ననలు లభించడంతో సంతోషపడుతున్న అనసూయ ఆ చిత్రయూనిట్ కు విందు ఇచ్చింది. ఈ విందు ఎంతో అద్భుతంగా ఉందంటూ రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన గౌరి నాయుడు ఓ ట్వీట్ చేశారు.

‘రంగమ్మత్త విందుభోజనం బాగుంది.. మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు’ అంటూ అనసూయతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ పై అనసూయ స్పందిస్తూ, ‘హాహాహా.. సచ్ లవ్లీ టైమ్’ అని తన సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News