Karnataka: కన్నడ ప్రజాప్రతినిధుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు

  • 2013 ఎన్నికల్లో గెలిచేనాటి గణాంకాలు
  • విడుదల చేసిన స్వచ్చంద సంస్థ
  • దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి
  • 36 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు

మరో నెలలోపే ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు వున్నాయి. సుమారు 35 శాతం మంది 2013 ఎన్నికల్లో గెలిచిన నాటికి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాజకీయ సంస్కరణల కోసం ఉద్యమించే స్వచ్చంద సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ కర్ణాటక ఎన్నికలకు ముందు ఈ గణాంకాలను విడుదల చేసింది.

రాజకీయాలు నేరమయం అన్న అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నివ్వెర పరిచే గణాంకాలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది. దేశంలో 1,765 ఎంపీలు, ఎమ్మెల్యేలకు గాను వీరిలో 36 శాతం మంది క్రిమినల్ కేసుల విచారణను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దీంతో ఆశ్చర్యపోయిన అత్యున్నత న్యాయస్థానం సత్వర విచారణకు గాను ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించడం గమనార్హం.  ప్రజలకు సేవ చేసే వీరు ఈ స్థాయిలో నేరారోపణలను ఎదుర్కోవడం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News