Pawan Kalyan: తెలంగాణ జన సైనికులూ కదలండి: పవన్ కల్యాణ్

  • జాతీయ రహదారులపై పాదయాత్రలు చేయండి
  • కార్యకర్తలకు పవన్ పిలుపు
  • ఏపీలో మొదలైన పాదయాత్రలు

తెలంగాణలోనూ జనసేన పార్టీని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న పవన్ కల్యాణ్, రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపైనా పాదయాత్రలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అభిమానులు, కార్యకర్తలకు సందేశమిచ్చారు. ఈ పాదయాత్రల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించాలని, జనసేన నినాదం కేంద్రానికి వినిపించాలని పవన్ కోరారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాలని సూచించారు. కాగా, నేడు ఏపీలో జాతీయ రహదారులపై జనసేన పాదయాత్రలు చేపట్టగా, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఈ యాత్రలు చేపట్టినట్టు జనసేన ప్రకటించింది.

Pawan Kalyan
Telangana
National Highways
Padayatra
  • Loading...

More Telugu News