the accidental prime minister: ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ఫస్ట్ లుక్ విడుదల.. మన్మోహన్ సింగ్ లా కుదిరిన అనుపమ్ ఖేర్!

  • ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పేరుతో పుస్తకం రాసిన సంజయ్ బారు
  • మన్మోహన్ సింగ్ కు మీడియా అడ్వైజర్ గా పని చేసిన సంజయ్ 
  • వచ్చే డిసెంబర్‌ 21న విడదల

‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన డా. మన్మోహన్‌ సింగ్‌ ఇతివృత్తంతో ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్‌ సింగ్‌ మీడియా అడ్వైజర్‌ గా పని చేసిన సంజయ్‌ బారు రాశారు. దీనిని ఆధారంగా తీసుకుని ఈ సినిమాను విజయ్ గుట్టే రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ లుక్ లో అనుపమ్ ఖేర్ అతికినట్టు సరిపోయారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్‌ సింగ్‌ లుక్‌ ని షేర్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాను వచ్చే డిసెంబర్‌ 21న విడదల చేయనున్నట్టు తెలిపారు. 

the accidental prime minister
manmohan singh
anupam kher
  • Error fetching data: Network response was not ok

More Telugu News