Pawan Kalyan: ఈ రోజున పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా ‘సర్రు’మని వెళుతోంది : ఉండవల్లి అరుణ్ కుమార్

  • ఈరోజున కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి కారణం పవన్ కల్యాణే
  • పవన్ ని అందరూ ఆశీర్వదించాలి
  • ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఉండవల్లి

ఈరోజు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా ప్రజల్లోకి దూసుకెళుతోందని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు. ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ, ‘ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా ‘సర్రు’మని వెళుతోంది. పార్లమెంట్ సమావేశాలు ఎన్ని రోజులుగా ఆగిపోయాయో మీరు చూశారుగా! అవిశ్వాస తీర్మానం మేము పెడతామంటే మేము పెడతామంటున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం పవన్ కల్యాణే కదా!’ అని అన్నారు.

ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడితే ‘నమ్మక ద్రోహి’, పవన్ కల్యాణ్ మాట్లాడితే ‘ఇన్నేళ్లకు నీకు మెలకువ వచ్చిందా?’ అని అంటున్నారు. అసలు, చంద్రబాబుకు, బీజేపీకి మధ్య ఉన్న గొడవేంటో చెప్పాలి!  ‘ఈ పాచిపోయిన లడ్డూలతో సర్దుకుపోవాలా?’ అని పవన్ కల్యాణ్ ఎప్పుడో ప్రశ్నించాడు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం పెద్ద రిస్క్. ఇలాంటి వాడిని ఆశీర్వదించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఒక మనిషి దెబ్బలాడేందుకు బయటకు వచ్చినప్పుడు, ఆ మనిషి వెనుక మనం నిలబడకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతాం. ఆ ద్రోహం చేయొద్దు!’ అని ఉండవల్లి అన్నారు.

  • Loading...

More Telugu News