kurien: రాజ్యసభలో బైఠాయించిన టీడీపీ సభ్యులతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ చర్చలు

  • సభలోంచి బయటకు వెళ్లాలని కోరిన కురియన్‌
  • వెళ్లబోమని చెప్పిన టీడీపీ సభ్యులు
  • కేంద్రం నుంచి స్పందన రావాల్సిందేనని వ్యాఖ్య
  • అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్‌ సభను రేపటికి వాయిదా వేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభలోనే కూర్చొని నిరసన తెలుపుతూ తాము బయటకు వెళ్లబోమని తెగేసి చెబుతోన్న విషయం తెలిసిందే. సభ వాయిదా పడి మూడు గంటలు అవుతున్నప్పటికీ వారు ఇంకా సభలోనే ఉండడంతో వారిని బయటకు పంపేందుకు రాజ్యసభ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజ్యసభలో బైఠాయించిన టీడీపీ ఎంపీల వద్దకు వచ్చిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్ దాదాపు 15 నిమిషాల పాటు వారితో చర్చలు జరిపారు. 3 గంటలకు పైగా రాజ్యసభ తలుపులు మూయకుండా సిబ్బంది వేచి చూస్తున్నారని, వారికి సహకరించాలని కురియన్ అన్నారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ సభ్యులు తేల్చి చెప్పారు. అనంతరం టీడీపీ సభ్యులతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ చర్చలు జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News