subramanya swami: నేను సభకు రోజూ వస్తున్నా... నా వేతనం ఎందుకు వదులుకోవాలి?: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

  • సభ నడవకపోతే అది నా తప్పు కాదు
  • నేను రాష్ట్రపతి ప్రతినిధిని 
  • ఆయన చెప్పనంత వరకు వేతనం తీసుకోకుండా ఎలా ఉంటా?

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎప్పటి మాదిరే స్వపక్షంలోనే విపక్షం తరహాశైలి తనదని మరోసారి నిరూపించుకున్నారు. పలు రాజకీయ పార్టీల ఆందోళనలతో పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. 23 రోజులుగా సభా కార్యకలాపాలు స్తంభించిపోయిన నేపథ్యంలో ఎన్డీయే ఎంపీలు అందరూ తమ వేతనాన్ని తీసుకోకుండా విడిచిపెట్టాలని కేంద్ర మంత్రి అనంతకుమార్ సూచన చేశారు. ప్రధానంగా కాంగ్రెస్, ఇతర పక్షాల తీరును విమర్శిస్తూ ఆయన ఈ ప్రతిపాదన తెచ్చారు. కానీ, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నుంచి దీనికి మద్దతు లభించలేదు. పైగా ప్రతిఘటన ఎదురుకావడం గమనార్హం.

తన వేతనాన్ని ఎందుకు వదులుకోవాలని స్వామి ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రశ్నించడం గమనార్హం.‘‘నేను రోజూ సభకు వెళ్తాను. ఒకవేళ సభ నడవకపోతే అది నా తప్పు కాదు. ఏదైనా సరే నేను రాష్ట్రపతి ప్రతినిధిని. ఆయన చెప్పనంత వరకు వేతనం తీసుకోకుండా ఎలా ఉంటాను?’’ అని స్వామి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

  • Loading...

More Telugu News