Chandrababu: ఎప్పుడంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అపహాస్యం పాలవుతాం: చంద్రబాబు

  • సరైన సమయాల్లోనే నిర్ణయాలు తీసుకోవాలి
  • నేను అటువంటి నిర్ణయమే తీసుకున్నాను
  • కేంద్ర ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది
  • మరో పార్టీ అండగా ఉందనే కుటిల రాజకీయాలు చేస్తోంది

సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎప్పుడంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అపహాస్యం పాలవుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాను అటువంటి నిర్ణయమే తీసుకున్నానని చెప్పారు. ఈ రోజు విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తాను ఎన్డీఏలో ఎందుకు చేరానో ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే చేరానని వ్యాఖ్యానించారు.

క్లిష్ట సమయంలో తాను తప్ప ఎవరూ రాష్ట్రానికి న్యాయం చేయలేరని తనను ప్రజలు గెలిపించారని చంద్రబాబు అన్నారు. తన మీదున్న నమ్మకంతో రైతులు రాజధానికి భూమిచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని, బీజేపీకి రాష్ట్రంలో ప్రాభవం లేదని, మరో పార్టీ అండగా ఉందనే కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. కేసుల మాఫీ కోసం వైసీపీ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News