karnataka: జేడీఎస్ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం?.. జనసేనానిని రప్పించే పనిలో కుమరస్వామి!

  • కర్ణాటకలో తారా స్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం
  • ఓటర్లను ఆకట్టుకునేందుకు రంగంలోకి సినీ స్టార్లు
  • పవన్ ఫాలోయింగ్ ను ఉపయోగించుకోవాలనుకుంటున్న కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరుకుంది. విజయమే పరమావధిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కర్ణాటకలోనే మకాం వేశారు. మరోవైపు జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిగౌడ కూడా విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ స్టార్లను రంగంలోకి దింపేందుకు ఆయన యత్నిస్తున్నారు. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ను ఆయన ప్రచారానికి ఆహ్వానించారు. మూడు రోజుల క్రితం వీరిద్దరూ భేటీ అయ్యారు.

మరోవైపు, బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ప్రచారానికి ఆహ్వానించాలని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం. పవన్ కూడా ప్రచారానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి హీరోయిన్ రమ్య, బీజేపీ నుంచి హేమమాలిని ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం. 

karnataka
assembly elections
kumaraswamy
jds
Pawan Kalyan
campaign
Rahul Gandhi
amit shah
sudeep
  • Loading...

More Telugu News