Mahesh Babu: మహేశ్ లుంగీ కడితే హిట్టే అంటోన్న అభిమానులు

  • మళ్లీ లుంగీ కట్టేసిన మహేశ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 
  • ఈ నెల 20వ తేదీన రిలీజ్  

మహేశ్ బాబు కథానాయకుడిగా చేసిన 'భరత్ అనే నేను' సినిమా, ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మహేశ్ లుంగీ పైకి కట్టేసి జనంతో కలిసి స్టెప్పు లేస్తున్నాడు.

గతంలో 'పోకిరి' సినిమా కోసం మహేశ్ లుంగీ కట్టాడు .. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ మధ్య వచ్చిన 'శ్రీమంతుడు' సినిమాలోను మహేశ్ లుంగీ కట్టాడు .. ఆ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు 'భరత్ అనే నేను'లోను మహేశ్ లుంగీ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. లుంగీ సెంటిమెంట్ కారణంగా ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు బలంగా చెబుతున్నారు. వాళ్లు చెబుతున్నట్టుగా నిజంగానే ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.     

  • Loading...

More Telugu News