ant bite: విచిత్రం: చీమ కుట్టి మహిళ మృతి

  • ఇంట్లో పని చేసుకుంటుండగా సోఫీ జెస్సీని కుట్టిన చీమ
  • తీవ్ర అస్వస్థతకు గురైన సోఫీ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

సాధారణంగా మనిషిని కుట్టిన చీమ చస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, చీమకుట్టి మహిళ మృతి చెందిన చిత్రమైన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... కేరళలోని ఆదోర్ కు చెందిన సోఫీ జెస్సీ (36) సౌదీ అరేబియాలోని రియాద్ లో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఆమెను ఒక చీమ కుట్టింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. సౌదీలో కొన్ని రకాల చీమలు కుట్టేటప్పుడు విషాన్ని శరీరంలోకి పంపుతాయని, తద్వారా మరణాలు కూడా సంభవిస్తున్నాయని రియాద్ కు చెందిన వార్తా సంస్థ తెలిపింది.

ant bite
ant bite lady dead
Saudi Arabia
riyadh
Keralite woman
  • Loading...

More Telugu News