shilpa chakravarthi: 'ఖుషీ' ఆడియో ఫంక్షన్ కి వెళ్లినప్పుడు షాకయ్యను: యాంకర్ శిల్పా చక్రవర్తి

  • నేను చేసిన ఫస్టు స్టేజ్ షో 'ఖుషీ'
  • ముందు చాలా భయపడిపోయాను 
  • ఝాన్సీ గారు ప్రోత్సహించారు    

కొంతకాలం క్రితం బుల్లితెరపై యాంకర్ గాను .. నటిగాను కొనసాగిన శిల్పా చక్రవర్తి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకెరియర్లో మొదటిసారిగా చేసిన స్టేజ్ షో అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు. "కెరియర్లో మొదటిసారిగా నేను చేసిన ఫస్టు షో 'ఖుషీ' ఆడియో ఫంక్షన్. అసలే నాకు కొత్త.. దానికి తోడు.. 'చిరంజీవిగారి బ్రదర్ పవన్ కల్యాణ్ గారి సినిమా  .. నువ్ యాంకరింగ్ చేయాలి .. పవన్ ను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి' అన్నారు.

 పవన్ కల్యాణ్ గారి ఫంక్షన్ అంటే చిరంజీవిగారు కూడా వస్తారు .. అంతే, నేను భయంతో వణికిపోయాను. స్టేజ్ పై ఝాన్సీ గారు కూడా వుంటారు .. నువ్ పక్కన నుంచో అనడంతో అప్పుడు మనసు కాస్త కుదుటపడింది. స్టేజ్ పై ఝాన్సీ గారి టాలెంట్ చూశాక .. ఇలా చేయడం నా వల్ల కాదనిపించింది. కానీ ఝాన్సీగారు నన్నెంతో ప్రోత్సహించారు. ఇక ఆ ఫంక్షన్ కి వెళ్లాక పవన్ కి ఎంతమంది అభిమానులు వున్నారో తెలిసి షాక్ అయ్యాను" అన్నారు.    

shilpa chakravarthi
  • Loading...

More Telugu News