Cricketer: అఫ్రిదీకి అదిరిపోయే పంచ్ ఇచ్చిన గంభీర్!

  • అఫ్రిదీ వ్యాఖ్యలపై మీడియా స్పందించమంటోంది
  • అతను యూఎన్ ను స్పందించాలని కోరాడు
  • యూఎన్ అంటే అతని దృష్టిలో అండర్ నైన్టీన్ అని అర్ధం

కశ్మీర్ విషయంలో భారత సైన్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. సమాజ సేవలో పాలు పంచుకునే గంభీర్, సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ సైన్యానికి మద్దతిస్తాడన్న సంగతి తెలిసిందే.

అఫ్రిదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గంభీర్ ను మీడియా ప్రశ్నించగా... స్పందించిన గంభీర్, 'అఫ్రిది ట్వీట్‌ పై నన్ను స్పందించాలని మీడియా కోరుతోంది. దానిపై ఏం స్పందించాలి? అఫ్రిది యూఎన్ ని స్పందించమంటున్నాడు. బుద్ధిమాంద్యం ఉన్న అఫ్రిదీ దృష్టిలో యూఎన్ అంటే అండర్ నైన్టీన్ అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌ కు ఔట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు' అంటూ దిమ్మదిరిగే సమాధానం చెప్పాడు.

Cricketer
India
team india
gautam gambhir
  • Error fetching data: Network response was not ok

More Telugu News