Karnataka: మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు?: కర్ణాటకలో రాహుల్ గాంధీ

  • ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టంపై మాట్లాడాలి
  • దళితులు, గిరిజనులపై దురాగతాలు జరుగుతున్నాయి
  • ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపడింది

ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టం సవరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎందుకు నోరు విప్పడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన శివమొగ్గ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... దేశంలో దళితులు, గిరిజనులపై దురాగతాలు జరుగుతున్నట్లు ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, హైదరాబాద్‌లో రోహిత్ వేముల హత్య, గుజరాత్‌లోని ఉనైలో దళితులపై దాడులు జరిగిన సమయంలోనూ మోదీ మాట్లాడలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపడిందని, ఇప్పుడు కూడా మోదీ తన తీరు మార్చుకోవడం లేదని అన్నారు. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల కోసం రాష్ట్ర సర్కారు అధికంగా నిధులు విడుదల చేసిందని చెప్పారు. 

  • Loading...

More Telugu News