: అడవుల మీద అధ్యయనానికి ఓ ప్రత్యేక శాటిలైట్
భూమ్మీద అడవులు ఏ మోతాదులో ఉన్నాయో.. వాటి పరిమాణం పరిస్థితి ఎలా ఉన్నదో లెక్క కట్టడానికి, తద్వారా భవిష్య పరిణామాలను గణించడానికి ప్రత్యేకించిన ఓ శాటిలైట్‌ను యూరోపియన్ అంతరిక్ష ఏజన్సీ రోదసిలోకి పంపడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు ఈ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి వారికి అనుమతి లభించింది. బయోమాస్ అనే పేరుతో వ్యవహరించే ఈ శాటిలైట్‌ను 2020 నాటికి అంతరిక్షంలోకి తీసుకువెళతారు.
ఈ ఉపగ్రహం చాలా ఆధునికమైన రాడార్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అది అడవుల్లోని చెట్ల కాండాలు, కొమ్మలను బట్టి.. తన కక్ష్యలోంచే.. భూమ్మీద ఉన్న అడవుల మోతాదును గణిస్తుంది. ఈ బయోమాస్ అందించే వివరాలను బట్టి.. శాస్త్రవేత్తలు.. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో ఉన్న కార్బన్ నిల్వలు ఏ పాటివో... లెక్కకడుతూ, భవిష్య అవసరాలకు ఎలాంటి మార్పు చేర్పులు చేయాలో ఆలోచిస్తారు. మొత్తానికి కేవలం పర్యావరణ కోణంలోనే భూమండలానికి మేలుచేసే ఒక ఉపగ్రహ ప్రయోగానికి యూరోపియన్ అంతరిక్ష ఏజన్సీ పూనుకున్నదన్నమాట.