Cricket: రాజస్థాన్ రాయల్స్ తప్పుడు నిర్ణయం తీసుకుంది: డీన్ జోన్స్

  • స్మిత్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ ను తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు
  • క్లాసెన్ ఎంపిక సరికాదని పేర్కొన్న డీన్ జోన్స్
  • క్లాసెన్ కంటే లూక్ రోంచీ మంచి ఎంపిక అని పేర్కొన్న జోన్స్

 రాజస్థాన్ రాయల్స్ జట్టు తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో సఫారీ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసన్‌ ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ లో క్లాసన్‌ కు అంత అనుభవం లేదని గుర్తు చేశాడు. అతని కంటే న్యూజిలాండ్‌ ఆటగాడు లూక్‌ రోంచిని తీసుకుని ఉండాల్సిందని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఒత్తిడిని ఎదుర్కొనేలా చేస్తుందని, రోంచీ నిరూపించుకున్న ఆటగాడని చెప్పాడు. 

Cricket
ipl
dean jons
henric clasen
Rajasthan royals
  • Loading...

More Telugu News