wife S*x: భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం అత్యాచారం కాదు: గుజరాత్ హైకోర్టు

  • అసహజ మార్గాల్లో కోరుకుంటే అది క్రూరత్వమే
  • గుజరాత్ హైకోర్టు స్పష్టీకరణ
  • భర్తకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన మహిళా డాక్టర్

భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం నెరిపితే అది అత్యాచారమేనంటూ గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా గుజరాత్ హైకోర్టు అభిప్రాయాలు వ్యక్తం చేసింది. భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం వైవాహిక అత్యాచారం కాదని స్పష్టం చేసింది. అయితే, నోటి ద్వారా, అసహజ మార్గాల్లో జీవిత భాగస్వామి శృంగారం కోరుకుంటే అది క్రూరత్వంతో సమానం అవుతుందని పేర్కొంది.

తన భర్త తనపై అత్యాచారం చేశాడని, హింసించాడంటూ ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ‘‘ఓ వ్యక్తి, జంతువు మధ్య జరిగే లైంగిక చర్య, ఇద్దరు పురుషుల మధ్య జరిగే అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యల వంటి విపరీత ప్రవర్తనలు మినహా మిగిలినవి ఏవీ ఐపీసీలోని సెక్షన్ 377 కిందకు రావని హైకోర్టు పేర్కొంది.

పిటిషన్ దాఖలు చేసిన మహిళా వైద్యురాలు, తన భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక కార్యం కోసం, ఓరల్ సెక్స్ కోసం  బలవంతం చేస్తున్నాడని కోర్టుకు తన బాధను తెలియజేశారు. అయితే, ఈ ఫిర్యాదును తిరస్కరిస్తూ సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని జస్టిస్ జేబీ పార్ధీవాలా పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో అత్యాచారం గురించి ఇందులో పేర్కొనలేదన్నారు. కాకపోతే అసహజ లైంగిక ఆరోపణలతో సెక్షన్ 377 కింద ఆమె పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు. 

  • Loading...

More Telugu News