Karnataka: టైమ్స్ స్క్వేర్ కోసం న్యూయార్క్ వరకు వెళ్లక్కర్లేదు... త్వరలో బెంగళూరులో సాకారం

  • బ్రిగేడ్ రోడ్డులో ఏర్పాటు యోచన
  • తద్వారా పర్యాటకులను ఆకర్షించాలన్నది వ్యూహం
  • ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించే పని స్వాతి రామ్ నాథన్ కు అప్పగింత

కర్ణాటక సర్కారుకు ఓ చక్కని ఆలోచన తట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్నదే ఆ ఆలోచన. దీంతో పర్యాటకులు టైమ్స్ స్క్వేర్ కోసం బెంగళూరు నగరానికి క్యూ కడతారని భావిస్తోంది. బెంగళూరులో రెసిడెన్సీ రోడ్, బ్రిగేడ్ రోడ్ లు కలిసే చోట బెంగళూరు టైమ్స్ స్క్వేర్ ఏర్పాటు చేసే ప్రణాళికతో కర్ణాటక సిద్దరామయ్య సర్కారు ఉంది.

 ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఓ యుద్ధ స్మారక స్తూపం ఉంది. ఇందుకు సంబంధించి మేయర్ ఆర్ సంపత్ ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేశారు. ‘‘న్యూాయార్క్ టైమ్స్ స్క్వేర్ మాదిరిగానే నగరంలో బెంగళూరు స్క్వేర్ ఉండాలని భావిస్తున్నాం. బ్రిగేడ్ రోడ్ ప్రారంభంలో దీన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించాలని స్వాతి రామనాథన్ ను కోరాం’’ అని మేయర్ సంపత్ తెలిపారు.

  • Loading...

More Telugu News