kedarnath: కేదార్ నాథ్ ఆలయం వద్ద ఘోర ప్రమాదం.. తలకిందులుగా కుప్పకూలిన హెలికాప్టర్

  • ప్రమాదానికి గురైన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్
  • ఇనుప బద్దీని ఢీకొట్టడంతో ప్రమాదం
  • ప్రమాదంలో ఆరుగురికి గాయాలు


ఉత్తరాఖండ్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. భారత వైమానికి దళానికి చెందిన ఓ హెలికాప్టర్ తలకిందులుగా కుప్పకూలింది. హెలీపాడ్ సమీపంలోని ఓ ఇనుప బద్దీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక పరికరాలతో పాటు కొంతమందిని తీసుకొస్తున్న ఎమ్ఐ-17 కార్గో హెలికాస్టర్ ఈ ఉదయం కేదార్ నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న హెలీపాడ్ వద్ద దిగేందుకు యత్నించింది. అయితే, అక్కడే ఉన్న ఓ ఇనుప బద్దీ హెలికాప్టర్ కు బలంగా తగిలింది. దీంతో, అది కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డవారికి ప్రథమ చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

kedarnath
helicopter
accident
crash
indian air force
  • Loading...

More Telugu News