Facebook: ఫేస్ బుక్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు.. గ్రూప్ అడ్మిన్ అరెస్టు!

  • ఫేస్ బుక్ లో గ్రూప్ అడ్మిన్ గా ఉన్న జె.ప్రశాంత్
  • గ్రూప్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదు
  • మఫ్టీలో వెళ్లి అరెస్టు చేసిన పోలీసులు

ఫేస్‌ బుక్‌ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్న గ్రూప్‌ అడ్మిన్‌ ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ అడ్మిన్ గా ఉన్న జె.ప్రశాంత్‌ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు, ఐటీ యాక్ట్ ప్రకారం ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అతనిని విడిచి పెట్టారు. అతనిపై కేసు నమోదు చేశామని, మళ్లీ విచారిస్తామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News