Telugudesam: ‘కేంద్రం’పై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యం : టీడీపీ నేత కళా వెంకట్రావు

  • హక్కుల సాధన కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు
  • ఏపీకి అమలు కావాల్సిన హామీలు నెరవేర్చాలని కోరతారు
  • ఏపీకి సహకరించే పార్టీల మద్దతును కూడగడతారు 
  • మీడియాతో మాట్లాడిన కళా వెంకట్రావు, సోమిరెడ్డి

ఏపీకి అమలు కావాల్సిన హామీలు నెరవేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని, హక్కుల సాధన కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. సీఎం చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి సహకరించే పార్టీల మద్దతును కూడగడతారని, ఈ మేరకు ఆయా పార్టీల నేతలకు చంద్రబాబు విఙ్ఞప్తి చేస్తారని అన్నారు. టీడీపీకి చెందిన మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాను సాధించడమే టీడీపీ లక్ష్యమని, బీజేపీ మిత్ర ధర్మం పాటించలేదని విమర్శించారు. 

Telugudesam
kala venkat rao
  • Loading...

More Telugu News