sukumar: బంగారం ఏ రూపంలో వున్నా బంగారమే .. జగపతిబాబు అలాంటివారే: సుకుమార్

  • పెరుగుతోన్న 'రంగస్థలం' జోరు
  • సంతోషాన్ని వ్యక్తం చేసిన టీమ్ 
  • జగ్గూభాయ్ గురించి సుకుమార్

'రంగస్థలం' సినిమా విడుదలైన ప్రతిప్రాంతంలో విజయవిహారం చేస్తోంది. భారీ వసూళ్లను సాధిస్తూ కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో ఇంతటి సక్సెస్ కి కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి గాను, ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లో 'థ్యాంక్యూ మీట్' నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ " 'నాన్నకు ప్రేమతో' చేసినప్పుడు  ఓ బిజినెస్ మేన్ గా జగపతిబాబు లుక్ చూసిన వాళ్లంతా ఆయన చాలా సెక్సీగా వున్నారని అన్నారు. ఇక 'రంగస్థలం'లో పక్కా పల్లెటూరి వ్యక్తిగా పంచె కట్టి ఆయన చుట్ట కాలుస్తారు. ఈ సారి కూడా కాల్స్ వచ్చాయి .. జగపతిబాబుగారు చాలా సెక్సీగా వున్నారని. ఆయన ఏ గెటప్ లో వున్నా గ్లామర్ పోకపోవడం విశేషం. బంగారాన్ని ఏ రూపంలోకి మార్చినా బంగారమే .. అలా జగపతిబాబుగారు కూడా బంగారంలాంటి ఆర్టిస్ట్ అని నా నమ్మకం" అంటూ చెప్పుకొచ్చాడు.      

  • Loading...

More Telugu News