USA: నేటి నుంచే హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ.. నిబంధనలు కఠినమే!

  • చిన్న తప్పులను కూడా ఉపేక్షించబోమని ప్రకటన
  • ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురికావచ్చన్న ఆందోళన
  • 65,000 వీసాల కోటా

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే నిపుణులు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమయం రానే వచ్చింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. మన దేశం నుంచి ఎక్కువ మంది ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వెళుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి ట్రంప్ సర్కారు దరఖాస్తుల ప్రక్రియ, వడపోత విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని మార్గదర్శకాలు చూస్తేనే తెలుస్తోంది.

చిన్న లోపాలు ఉన్నా సహించబోమని ఈ ప్రక్రియను చూసే అమెరికా పౌర, వలసల విభాగం (యూఎస్ సీఐఎస్) హెచ్చరించడం ఇందుకు నిదర్శనం. దీంతో ఈ ఏడాది ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 65,000 వార్షిక వీసాల జారీ కోటా అమలవుతుంది. 20,000 వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఉన్నత విద్య చేసిన వారికి కేటాయించారు. గరిష్ట పరిమితి కోటాతో సంబంధం లేకుండా వీరికి వీసాల జారీ ఉంటుంది.

USA
H1B Visa
  • Loading...

More Telugu News