Chandrababu: రాజకీయాలను కాదు.. దీన్ని హైలైట్ చేయండి: మీడియాకు చంద్రబాబు విన్నపం

  • రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే హైలైట్ చేయండి
  • ఏపీ హక్కులను సాధించేందుకే ఢిల్లీ పర్యటన
  • పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వివిధ పార్టీల నేతలను కలుస్తా

రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చెప్పారు. ఏపీ హక్కులను సాధించేందుకే తాను ఢిల్లీ పర్యటనను చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాకు ఆయన ఓ విన్నపం చేశారు. రాజకీయాలను హైలైట్ చేయవద్దని... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే హైలైట్ చేయాలని కోరారు.

మరోవైపు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడమే తమ సామర్థ్యమని టీడీపీ ఎంపీలతో ఆయన అన్నారు. ఈ ఉదయం పార్టీ ఎంపీతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే తాను ఢిల్లీ పర్యటన చేపడుతున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలుస్తానని తెలిపారు.

నమ్మించి, మోసం చేసిందంటూ బీజేపీపై మండిపడ్డారు. అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు కూడా విలువ లేకపోతే ఎలాగని ఆయన అన్నారు. తన ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైసీపీ చేస్తున్న లాలూచీ రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. అందుకే పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామాల డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.

Chandrababu
delhi trip
media
suggestions
  • Loading...

More Telugu News