charan: ఇప్పట్లో 'రంగస్థలం' దూకుడును ఆపడం కష్టమే!

  • దూసుకుపోతోన్న 'రంగస్థలం'
  • వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ 
  • సినిమాలోని ప్రతి అంశం ప్రత్యేకమే

'రంగస్థలం' సినిమా ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. యూఎస్ లోను ఈ సినిమా భారీవసూళ్లతో పరుగులుతీస్తోంది. ఆదివారం ముగిసేనాటికి ఈ సినిమా 84 కోట్ల గ్రాస్ ను .. 53 కోట్ల షేర్ ను సాధించి వుండొచ్చని అంటున్నారు.

 ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 35 కోట్ల షేర్ ను వసూలు చేసి ఉండొచ్చని చెబుతున్నారు. బలమైన కథాకథనాలు .. కొత్తగా అనిపించే పాత్రలు .. ఆకట్టుకునే గ్రామీణ నేపథ్యం .. ఆ నేపథ్యానికి అందంగా అతికిన పాటలు ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమని చెప్పుకుంటున్నారు. దగ్గరలో పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో, ఇప్పట్లో 'రంగస్థలం' దూకుడును ఆపడం కష్టమేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.    

  • Loading...

More Telugu News