Medak District: జీఎంఆర్ సంస్థకు హరీష్ రావు వార్నింగ్!

  • రైల్వే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వెళ్లిన హరీశ్ రావు
  • నాగులపల్లి వంతెన నిర్మాణంపై ఫిర్యాదు చేసిన స్థానిక ఎంపీ 
  • నిర్మాణం మొదలు పెట్టకపోతే టోల్ గేట్ ను బద్దలు కొడతామని హెచ్చరిక 

జీఎంఆర్ సంస్థకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం నాగులపల్లి వద్ద జీఎంఆర్ సంస్థకు చెందిన అల్లాపూర్ టోల్ గేట్ ఉంది. మనోహరబాద్‌, కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వచ్చిన హరీశ్ రావు దృష్టికి జీఎంఆర్ సంస్థ నాగులపల్లి వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విషయాన్ని, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హరీశ్‌ రావు.. ఈనెల 15 లోపు వంతెన నిర్మాణ పనులు చేపట్టని పక్షంలో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. అంతే కాకుండా టోల్ గేట్ ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Medak District
allapur toll gate
nagulapalli
  • Loading...

More Telugu News