Bhojpuri: సహ నటిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి గోడకేసి బాదిన భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్

  • సినిమా షూటింగ్‌లో ఘటన
  • తాగిన మత్తులో టాప్ హీరోయిన్ అక్షర సింగ్‌పై దాడి
  • గతంలో ఇద్దరి మధ్య ఎఫైర్

భోజ్‌పురి సూపర్ స్టార్, పలు సూపర్ హిట్ గీతాలను పాడిన స్టార్ హీరో పవన్ సింగ్ మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. ఓ సినిమాలో తనతో కలిసి నటిస్తున్న సహ నటిపై ప్రతాపం చూపాడు. తాగిన మత్తులో రెచ్చిపోయాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి గోడకేసి బాదాడు. ఈ ఘటనలో ఆమె గాయపడింది. ప్రముఖ జర్నలిస్ట్ శశికాంత్ సింగ్ ఈ వ్యవహారాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించడంతో సంచలనమైంది.  

సిల్వస్సాలోని డామన్ గంగా లోయ రిసార్ట్‌లో రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు ఆయన వివరించారు. మద్యం మత్తులో ఉన్న పవన్ సింగ్ తనతో కలిసి నటిస్తున్న టాప్ హీరోయిన్‌ అక్షర సింగ్‌ను బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని, గోడకేసి బాదాడని శశికాంత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రిసార్ట్ సిబ్బందిపైనా ఆయన దాడి చేసినట్టు తెలిపారు.

శశికాంత్ కథనం ప్రకారం.. పవన్-అక్షరలు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం సిల్వస్సా చేరుకున్నారు. గురువారం రాత్రి  పూర్తిగా మద్యం మత్తులో ఉన్న పవన్ తన రూము నుంచి బయటకు వస్తుండగా అక్షర అతడిని ఆపేందుకు ప్రయత్నించింది. అంతే.. ఒక్కసారిగా రెచ్చిపోయిన పవన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. గోడకేసి బాదాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. కాగా, గతంలో అక్షరను పలు సిిినిమాల నుంచి పవన్ తప్పించాడు.  

పవన్-అక్షరలు గతంలో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. పలు సందర్భాల్లో అక్షరను తన ప్రేమికురాలిగా పవన్ పరిచయం చేశాడు. అయితే ఇటీవల ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో జ్యోతి సింగ్ అనే మరో యువతిని పెళ్లాడాడు.

Bhojpuri
Actor
Pawan sing
Akshara singh
  • Loading...

More Telugu News