Kerala: తెరుచుకోనున్న పూరి జగన్నాథ్ ఆలయ 'రత్నభండారం'...సంపద లెక్కలపై అప్పుడే ఊహాగానాలు....!

  • ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్‌లో రత్న భండారం తెరిచేందుకు అనుమతి
  • అపార సంపద ఉన్నట్లు ఏళ్లుగా ప్రచారం
  • సంపద లెక్కలపై అప్పుడే మొదలైపోయిన ఊహాగానాలు

ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్నభండారాన్ని తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు అనుమతులు జారీ చేసింది. రత్న భండారంలోని మొత్తం ఏడు గదుల్లో అమూల్యమైన వజ్రవైఢూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భండారాన్ని తెరిచేందుకు అనుమతులు రావడంతో సర్వత్రా అమితమైన ఆసక్తి నెలకొంది. తొలుత 1984లో ఆ తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. అయితే నాలుగో గది నుంచి నాగుపాముల బుసలు వినిపించాయి. నాగశబ్దం కారణంగా భయపడి ఆ గదిని తెరవలేదని అప్పటి అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు రత్నభండారం తలుపులు తెరిస్తే అరిష్టమంటూ కొన్ని ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

క్రీస్తుశకం 1078వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం వెనుక సైన్సుకు అందని అనేక విషయాలు ఇప్పటికీ రహస్యాలుగానే ఉన్నాయి. కాగా, గతంలో కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోనూ ఆరు గదుల్లో అనంతమైన నిధినిక్షేపాలు ఉన్నాయని తెలియడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందులోని ఐదు గదులను తెరిచారు. తర్వాత కొంతకాలానికి నాగబంధం ఉన్న ఆరో గదిని కూడా ధైర్యం చేసి తెరిచి అందులోని అపార సంపదను అధికారులు లెక్కించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి పూరి జగన్నాథుడి ఆలయంపై పడింది. ఇక్కడి రత్నభండారం తెరిస్తే ఏ స్థాయిలో సంపద బయటపడుతుందోనని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

Kerala
Anantha Padmanabha Swamy Temple
Odisha
Puri Jagannath Temple
  • Loading...

More Telugu News