Bhuma Akhilapriya: తండ్రి బతికుంటే అఖిలప్రియ చెంపలు పగులగొట్టేవారు: భూమా సన్నిహితుడు సుబ్బారెడ్డి

  • అఖిల ప్రియను వ్యతిరేకిస్తున్న ఏవీ సుబ్బారెడ్డి
  • తనను గుంటనక్కగా అభివర్ణించడంపై ఆగ్రహం
  • భూమా బతికుంటే ఇలా జరిగేది కాదన్న సుబ్బారెడ్డి

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహార శైలిని చానాళ్లుగా వ్యతిరేకిస్తున్న భూమా నాగిరెడ్డి అనుచరుడు, ఆళ్లగడ్డ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య సయోధ్య కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఇటీవల ఏవీ హెల్ప్ లైన్ ప్రారంభోత్సవ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

అఖిలప్రియ తనను గుంటనక్కగా సంబోధించిందని గుర్తు చేసిన ఆయన, భూమా బతికుంటే, తనను తూలనాడినందుకు ఆమె చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టి ఉండేవారని అన్నారు. తామిద్దరి మధ్యా ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన సుబ్బారెడ్డి, తాను దర్శకుడినైతే, భూమా హీరో అని అభివర్ణించారు. భూమా వర్థంతి సభలో తాను లేకుంటే ఆయన ఆత్మ శాంతించదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అవకాశం ఇస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

Bhuma Akhilapriya
AV Subbareddy
Allagadda
Bhuma Nagireddy
  • Loading...

More Telugu News