Tollywood: అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులు... టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై జగపతిబాబు అభిప్రాయమిది!

  • గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టే సినీ పరిశ్రమపై చర్చ
  • ఆ పరిస్థితి ఎదురైతే అమ్మాయిలు నిరాకరించాలి
  • నటుడు జగపతిబాబు సలహా

అమ్మాయిలకు లైంగిక వేధింపులు కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదని, ఏ రంగంలోనైనా ఇవి జరుగుతూనే ఉంటాయని, అయితే, సినిమా ఫీల్డ్ లో గ్లామర్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతోందని నటుడు జగపతిబాబు అభిప్రాయపడ్డారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ, ఎవరైనా సరే, సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు ఇస్తామని చెబితే, అందుకు అమ్మాయిలు గట్టిగా నిరాకరించాలని పిలుపునిచ్చారు.

తనవరకూ సినీ రంగం సురక్షితమైనదన్న అభిప్రాయమే ఉందని, తన కుమార్తెలు యాక్టింగ్ చేస్తానని చెబితే, అభ్యంతరపెట్టబోనని స్పష్టం చేశారు. తన చిన్న కూతురు చదవలేక చదువుతుంటే, శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా? అని సలహా కూడా ఇచ్చానని అన్నారు. అయితే, తన బిడ్డలకు ఈ రంగంపై ఆసక్తి లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. తనకు పారితోషికం గురించిన ఆలోచనే రాదని, కొన్నిసార్లు డబ్బులు అడక్కుండానే సినిమాలు చేస్తానని చెప్పిన జగపతిబాబు, ఇటీవల ఓ చిన్న సినిమా కథనచ్చి, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా నటించేందుకు అంగీకరించానని చెప్పారు.

Tollywood
Jagapati babu
Casting Couch
Harrasment
  • Loading...

More Telugu News