charan: ఇంతటి ఘన విజయానికి ముఖ్య కారకుడు చరణ్: సుకుమార్

  • 'రంగస్థలం' విజయవిహారం 
  • చిరూలో ఆనందం చూశాను
  • అంతకు మించిన సంతోషం లేదు        

కథను ఆసక్తికరంగా తయారు చేసుకోవడంలోను .. ఆకట్టుకునేలా దృశ్యరూపాన్ని ఇవ్వడంలోను సుకుమార్ సిద్ధహస్తుడు. అదే తరహాలో ఆయన మలచిన 'రంగస్థలం' నిన్నటి నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నేను ఈ సినిమా కోసం కథను చాలా తక్కువ సమయంలోనే రెడీ చేసుకున్నాను. కానీ వినికిడి లోపం కలిగిన 'చిట్టిబాబు' పాత్ర కోసం ఎక్కువ రోజుల పాటు స్టడీ చేయవలసి వచ్చింది" అన్నాడు.

"పల్లెటూరి మనుషుల తీరుతెన్నులను మరింత దగ్గరగా పరిశీలించవలసి వచ్చింది. ఈ సినిమా కథపై నేను పెట్టుకున్న నమ్మకం వృథా కాలేదు. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకుడు చరణ్ .. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్. ఇక ఈ సినిమా రిలీజ్ కాగానే చిరంజీవి గారి ఇంటికి వెళ్లాను. సంతోషంతో ఆయన గట్టిగా కౌగలించుకుని అభినందించారు .. అంతకుమించిన ఆనందం ఏవుంటుంది?" అంటూ చెప్పుకొచ్చాడు.       

  • Loading...

More Telugu News