charan: షాక్ ఇస్తోన్న 'రంగస్థలం' తొలిరోజు వసూళ్లు!

  • నిన్ననే విడుదలైన 'రంగస్థలం' 
  • ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల గ్రాస్ 
  • ఆశ్చర్యపోతోన్న ఇండస్ట్రీ వర్గాలు      

'రంగస్థలం' సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి వస్తోన్న రెస్పాన్స్ తో, ఈ సినిమా తొలిరోజున ఎంతమొత్తం వసూలు చేసి వుంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. మెగా అభిమానులంతా కూడా ఈ సినిమా వసూళ్ల వివరాలు తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల గ్రాస్ ను .. 28 కోట్ల షేర్ ను వసూలు చేసిందనేది తాజా సమాచారం.

ఇండస్ట్రీకి చెందిన వాళ్లంతా కూడా ఇవి కళ్లు చెదిరిపోయే వసూళ్లు అని అంటున్నారు. యూఎస్ లో తొలిరోజునే ఈ సినిమా మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోవడం విశేషమని చెబుతున్నారు. జనంలోకి ఈ సినిమా దూసుకుపోతోన్న తీరు చూస్తుంటే, 'మగధీర' తరువాత చరణ్ అందుకున్న ఆ స్థాయి విజయం ఇదేనని అనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు రావడం మొదలవుతుందని చెబుతున్నారు. మొత్తానికి చరణ్ ఈ వేసవిలో అభిమానుల దాహాన్ని పూర్తిగా తీర్చేశాడన్న మాట.     

  • Loading...

More Telugu News