: ఈ హార్మోన్ ద్వారా మధుమేహానికి బ్రేకులు
మన శరీరంలోని ఏపీ2 అనే ఒక హార్మోన్ గ్లూకోజ్ ను నియంత్రించే శక్తిని కలిగిఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దేహంలోని కాలేయం నుంచి గ్లూకోజు ఉత్పత్తిని నియంత్రించడం మాత్రమే కాదు... రక్తంలో గ్లూకోజు మోతాదును కూడా ఈ హార్మోన్ నియంత్రిస్తుంది. మధుమేహం, ఇతర ఆ తరహా రోగాల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తేగల ఈ హార్మోన్ కొవ్వు కణాలనుంచి విడుదల అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ వివరాలను అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గోఖన్ ఎస్.హోటా మిస్‌లిగిల్ చెప్పారు. పోషణలోపం తలెత్తినప్పుడు శరీరానికి గ్లూకోజు తగు మోతాదులో సరఫరా అయ్యేలా కొవ్వు కణాలు కాలేయానికి ఆదేశాలు ఇస్తుంటాయి. ఈ ప్రక్రియలో కొవ్వు కణాలు కాలేయానికి మధ్య ఈ హార్మోన్‌ల విడుదల వంటి వ్యవస్థ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.