charan: 'రంగస్థలం' వసూళ్ల జోరు .. మెగా అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

  • సుకుమార్ .. చరణ్ లకు ఫుల్ మార్క్స్ 
  • మెగా అభిమానుల్లో ఆనందం 
  • కొత్త రికార్డులపై చర్చలు    

మెగా అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు .. సంతోషంతో సంబరపడిపోతున్నారు. చరణ్ తాజా చిత్రంగా థియేటర్స్ కి వచ్చిన 'రంగస్థలం' అనూహ్యమైన రీతిలో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణ అంతా ఇంతా కాదు. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' వసూళ్ల రికార్డును 'రంగస్థలం' క్రాస్ చేస్తుందా? అనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి.

'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే, 'రంగస్థలం' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రీ రిలీజ్ విషయంలో 'రంగస్థలం' రికార్డు సృష్టించిందనే అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ మాదిరిగానే వసూళ్ల విషయంలోను 'ఖైదీ నెంబర్ 150' రికార్డును 'రంగస్థలం' క్రాస్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 1700 థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా, చిరూ మూవీ రికార్డును అధిగమించే ఛాన్స్  లేకపోలేదనేది మరికొందరి అభిప్రాయం.     

  • Loading...

More Telugu News