Telangana: ఇంటి ఆవరణలో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు!

  • అన్నకోసం పసరు మందు నూరుతున్న మొగులప్ప
  • బండ కింద నుంచి ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన పాము పిల్లలు
  • బండను తొలగించడంతో కంటబడిన పాములు

ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న పాము పిల్లలను చూసి బండరాతిని తొలగించిన గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాని వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన చాకలి హుసేనప్పకు దెబ్బ తగలింది. దీంతో ఆ దెబ్బకు కట్టుకట్టేందుకు కొన్ని ఆకులు తెచ్చిన అతని సోదరుడు మొగులప్ప ఇంటి ఆవరణలో ఉన్న రాతిపై నూరడం మొదలు పెట్టాడు.

ఇంతలో ఆ బండ సందులోంచి రెండు పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో వాటిని చుట్టుపక్కల వారి సాయంతో చంపి, ఆ బండను తొలగించగా అక్కడి నుంచి కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. దీంతో సుమారు 300 పాము పిల్లలను చంపి తగులబెట్టారు. తెల్లవారిన తరువాత మరోనాలుగు పాము పిల్లలు బయటకు రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Telangana
Vikarabad District
basheerabad
snakes
  • Loading...

More Telugu News