Renuka chowdary: వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది చెప్పేసిన రేణుకా చౌదరి

  • ఏప్రిల్ 2తో రాజ్యసభ సభ్యత్వం పూర్తి
  • వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి బయటపెట్టారు. మరో రెండు రోజుల్లో రాజ్యసభ సభ్యురాలిగా పదవీ విరమణ చేయనున్న రేణుక.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు.

రాజ్యసభ సభ్యురాలిగా పదవీ కాలం పూర్తి చేసుకున్న రేణుక విలేకరులతో మాట్లాడుతూ తాను రాజ్యసభకు వెళ్లినా ఖమ్మం ప్రజలతోనే ఉన్నానని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు రాజ్యసభలో చేపట్టిన ఆందోళనకు తన మద్దతు తెలిపానని, ఇందులో రాజకీయ కోణం లేదని అన్నారు.

Renuka chowdary
Congress
Khammam
  • Loading...

More Telugu News