Shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • శ్రుతి హాసన్ చేతిలో బాలీవుడ్ సినిమా 
  • మల్టీ స్టారర్ లో సంపూర్నేష్ బాబు 
  • స్పెయిన్ లో మహేశ్ ఆటాపాటా!  

*  ఇటీవలి కాలంలో కథానాయికగా జోరు తగ్గించిన శ్రుతి హాసన్ తాజాగా హిందీలో ఓ చిత్రానికి సంతకం చేసింది. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ రూపొందించే చిత్రంలో నటించడానికి శ్రుతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
*  నాగార్జున, నాని హీరోలుగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సంపూర్నేష్ బాబు ఓ కీలక పాత్ర చేయనున్నట్టు సమాచారం. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ త్వరలో మొదలవుతుంది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం కోసం స్పెయిన్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్న ఈ పాట ఏప్రిల్ 5తో పూర్తవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేస్తారు. 

  • Loading...

More Telugu News