selfie: లారీ ఢీకొని తీవ్ర గాయాలపాలైన ఏఎస్సై.. స్మార్ట్‌ఫోన్‌లలో ఫొటోలు తీసుకున్న స్థానికులు

  • ఏఎస్సై రోడ్డు దాటుతుండగా ప్రమాదం
  • ఆలస్యంగా ఆసుపత్రికి తరలింపు
  • ఏఎస్సై మృతి చెందినట్లు చెప్పిన వైద్యులు
  • ఖమ్మం రూరల్‌ డివిజన్ ప్రాంతంలో ఘటన

ఓ ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో నడిరోడ్డుపై పడి ఉండగా స్థానికులు కనీస మానవత్వం చూపకుండా ఫొటోలు, వీడియోలు తీసుకున్న ఘటన ఖమ్మం రూరల్‌ డివిజన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రఘునాథ్ పాలెం పోలీసు కానిస్టేబుళ్లు.. సదరు ఏఎస్సైని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఏఎస్సై ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

చనిపోయిన ఏఎస్‌ఐ పేరు భాస్కర్ అని సంబంధిత అధికారులు తెలిపారు. ఆయన రఘునాథ్‌పాలెం పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్నారని అన్నారు. ఈ రోజు ఉదయం ఓ గ్రామానికి ఎస్సైతోపాటు ఆయన బందోబస్తుకు వెళ్లారని, అక్కడి నుంచి తిరిగొస్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఓ లారీ ఆయనను ఢీ కొట్టిందని తెలిపారు. 

selfie
video
Road Accident
  • Loading...

More Telugu News