charan: 'రంగస్థలం' యూఎస్ ప్రీమియర్ షోలు .. టాప్ 10లో చోటు!

  • తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ 
  • యూఎస్ లో ప్రీమియర్స్ లో దూకుడు 
  • చరణ్ కెరియర్లో ఇదే మొదటిసారి

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా రూపొందిన 'రంగస్థలం' ఈ రోజునే భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాకి, తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక యూఎస్ లోను ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా భారీస్థాయి వసూళ్లనే రాబట్టింది.

యూఎస్ లో గత రాత్రి 142 సెంటర్స్ లో విడుదలైన ఈ సినిమా, ప్రీమియర్ షోల ద్వారా 6.2 లక్షల డాలర్లను రాబట్టింది. యూఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాల్లో 'రంగస్థలం' 6వ స్థానంలో నిలిచిందని చెబుతున్నారు యూఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం చరణ్ కెరియర్లో మొదటిసారి అని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టిందనేది త్వరలో తెలియనుంది. 

  • Loading...

More Telugu News