Chandrababu: నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

  • ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ
  • ప్రత్యేక హోదా పోరాటానికి సినీ పరిశ్రమ మద్దతు
  • నల్ల బ్యాడ్జీలతోనే షూటింగ్ లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అశ్వనీదత్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, రాఘవేంద్రరావు, జెమిని కిరణ్, టి.వెంకటేశ్వరరావు, జీకే తదితరులు ఉన్నారు. ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి వీరంతా ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని వీరు తెలిపారు. అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు తాము కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పారు. సినిమా షూటింగ్ లకు కూడా నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతామని తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు నిరసనను వ్యక్తం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా వీరంతా నల్ల బ్యాడ్జీలను ధరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తోందనే విషయాన్ని సినీ ప్రముఖులకు చంద్రబాబు వివరించినట్టు సమాచారం. 

Chandrababu
Tollywood
meeting
raghavendra rao
ashwini dutt
  • Loading...

More Telugu News