ananthapuram: అనంతపురం టీడీపీలో చిచ్చు.. ప్రభాకర్ చౌదరిపై తిరుగుబాటు!

  • జకీవుల్లా నేతృత్వంలో పలువురు నేతల సమావేశం
  • ప్రభాకర్ వ్యవహారశైలిపై విమర్శలు
  • కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ

అనంతపురం నియోజకవర్గ టీడీపీలో చిచ్చు రేగింది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై మాజీ ఎంపీ సైఫుల్లా వర్గీయులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సైఫుల్లా కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీవుల్లా నేతృత్వంలో పార్టీ నేతలు జయరాంనాయుడు, లక్ష్మీపతి, కార్పొరేటర్లు ఉమామహేశ్వర్, లాలెప్ప, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుద్దీన్, కోఆప్షన్ సభ్యులు మున్వర్, కృష్ణకుమార్ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా ప్రభాకర్ చౌదరిపై విమర్శలు గుప్పించారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు గత నాలుగేళ్ల టీడీపీ అధికారంలో ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. వీరి విమర్శలపై ప్రభాకర్ చౌదరి స్పందిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీ చూసుకుంటుందని... తన కోసం పాటుపడినవారిని తాను చూసుకుంటానని చెప్పారు.  

ananthapuram
Telugudesam
prabhakar chowdary
  • Loading...

More Telugu News