bolero: బద్దలైన నీటి పైప్.. సినిమా ఫక్కీలో గాల్లోకి ఎగిరిన బొలెరో వాహనం... వీడియో చూడండి

  • 10 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ బొలెరో
  • షాక్ అయిన జనాలు
  • ఉత్తర ముంబైలో ఘటన

ఉత్తర ముంబైలోని ఓ నడిరోడ్డులో వాటర్ పైప్ లైన్ బద్దలైన నేపథ్యంలో భారీ మొత్తంలో నీరు వృథాగా పోయింది. రోడ్డుపై నీరు లీకవుతున్న సమయంలో ఓ బొలెరో వాహనం వచ్చి, సరిగ్గా పైపు లీకైన ప్రదేశంపైనుంచి వెళ్లే ప్రయత్నం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో పైపు లైన్ బద్దలైంది. ఒక్కసారిగా పైపు నుంచి నీరు విపరీతమైన ఫోర్స్ తో ఎగజిమ్మింది. దీని ధాటికి పైన ఉన్న బొలెరో వాహనం సినీ ఫక్కీలో గాల్లోకి అమాంతం ఎగిరింది. సుమారు 10 అడుగుల ఎత్తుకు కారు ఎగసి పడింది. దీన్ని చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ అరుదైన సన్నివేశాన్ని తన సెల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

bolero
water pipe
burst
flung up
  • Error fetching data: Network response was not ok

More Telugu News