sukumar: 'రంగమ్మ‌త్త‌'గా అన‌సూయ అల‌రిస్తుంది: దర్శకుడు సుకుమార్

  • రేపే 'రంగస్థలం' విడుదల
  • ఈ సినిమాలో అంద‌రూ మంచి ఆర్టిస్టులే ఉన్నారన్న సుకుమార్
  • 'రంగస్థలం'లో న‌టించిన వారందరికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన దర్శకుడు

తమ కొత్త సినిమా 'రంగస్థలం' విషయంలో ఎక్కడా రాజీ పడవ‌ద్ద‌ని, ఈ సినిమాలో అంద‌రూ మంచి ఆర్టిస్టులే ఉండాల‌ని ప్రొడ్యూస‌ర్లు నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి చెప్పారని దర్శకుడు సుకుమార్ తెలిపారు. అలా తనపై ఒత్తిడి తీసుకురావ‌డం వ‌ల్ల ఈ సినిమా బాగా వచ్చిందని వ్యాఖ్యానించారు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్, చెన్నై బ్యూటీ స‌మంత కాంబినేష‌న్ లో దర్శకుడు సుకుమార్ రూపొందిస్తోన్న రంగస్థలం సినిమా రేపు విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ... ఈ సినిమాలో అంద‌రూ చాలా మంచి ఆర్టిస్టులే ఉన్నారని అన్నారు. ఈ సినిమాలో న‌టించిన వారందరికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ సినిమా బాగా రావ‌డానికి వారు బాగా స‌హ‌కారం అందించారని, అలాగే ఈ సినిమాలో 'రంగమ్మ‌త్త‌'గా అన‌సూయ నటించిందని, ఆ పాత్ర అందరినీ అల‌రిస్తుందని అన్నారు.  

  • Loading...

More Telugu News