Smruti irani: కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఆఫీసులో హస్తం గుర్తు ఫోటో... ట్విట్టర్ లో పెట్టి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన స్మృతీ ఇరానీ

  • బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం
  • ఓ ఫోటోను ట్వీట్ చేసిన సుష్మా స్వరాజ్
  • కేంబ్రిడ్జ్ కార్యాలయంలో కనిపిస్తున్న కాంగ్రెస్ గుర్తు

ఫేస్ బుక్ వినియోగదారుల డేటా లీక్ విషయంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కోటలను దాటుతున్న వేళ, బ్రిటన్ సంస్థ, ఫేస్ బుక్ ఖాతాల సమాచారాన్ని వాడుకున్న కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థ కార్యాలయం గోడలపై హస్తం గుర్తు ఫోటో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ చిత్రాన్ని కేంద్ర సమాచార, ప్రసార, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

"ఎంత గొప్ప సంగతి రాహుల్... కాంగ్రెస్ హస్తం కేంబ్రిడ్జ్ ఎనలిటికా తో పాటు ఉంది" (క్యా బాత్ హై రాహుల్ గాంధీ జీ... కాంగ్రెస్ కా హాథ్, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కే సాథ్) అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో సస్పెండ్ కాబడిన సంస్థ సీఈఓ అలెక్జాండర్ నిక్స్ కనిపిస్తుండగా, అతని వెనుక హస్తం గుర్తు కనిపిస్తోంది. కాగా, డేటా తస్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు, తమకు సంబంధం లేదని వాదిస్తున్న కాంగ్రెస్ ను స్మృతీ ఇరానీ ఈ ట్వీట్ తో ఇరుకున పెట్టినట్లయింది.

Smruti irani
Congress
Twitter
Hand Symbol
  • Loading...

More Telugu News