Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు

  • ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై ‘సుప్రీం’ తీర్పు ఆందోళనకరంగా ఉంది 
  • ఈ తీర్పుతో అత్యాచారాలు మరింతగా పెరిగిపోతాయి 
  • కోవింద్ కు విన్నవించుకున్న ఎంపీలు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈరోజు సాయంత్రం కలిశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందనే విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దళితులు, ఆదివాసీలపై దేశ వ్యాప్తంగా అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో చట్టంలో అరెస్టులకు సంబంధించిన నిబంధనలను నీరుగార్చేలా సుప్రీంకోర్టు తీర్పు ఉందని రామ్ నాథ్ కోవింద్ కు విన్నవించారు. ఈ తీర్పుతో అత్యాచారాలు మరింతగా పెరిగిపోతాయని కాంగ్రెస్ నేతలు భయాందోళనలు వ్యక్తం చేశారు.  
కాగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీల బృందం రామ్ నాథ్ కోవింద్ ను కలిసినట్టు రాష్ట్రపతి కార్యాలయం వెబ్ సైట్ లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులను తక్షణం అరెస్టు చేయవద్దని, సంబంధిత అధికారి ధ్రువీకరించిన తర్వాతే వారిని అరెస్టు చేయాలని ఈ నెల 20న సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.

  • Loading...

More Telugu News