geetanjali: సీరియల్స్ లో చేయమని రాధిక అడిగింది .. చేయకపోవడానికి కారణమదే: సీనియర్ నటి గీతాంజలి

  • రెండు సీరియల్స్ చేయమని రాధిక అడిగింది
  • పేదరాలుగా కనిపించే పాత్రలు అవి 
  • అలా కనిపించడం ఇష్టం లేదని చెప్పాను

సీనియర్ నటీమణి గీతాంజలి .. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. " మా వారు పోయిన తరువాత చాలా రోజుల వరకూ నేను ఆ డిప్రెషన్ లోనే వున్నాను. ఆ తరువాత ఏవిఎం వారు ఒత్తిడి చేయడంతో, కాదనలేక వాళ్ల సీరియల్ చేశాను. అదే సమయంలో రాధిక కబురు పెట్టింది .. తన సీరియల్స్ చేయమని".

"ఆమె పంపించడంతో ఆ దర్శకుడు వాళ్లు వచ్చి నాతో మాట్లాడారు. చాలా పేదరాలైన పాత్ర అని చెప్పారు .. అంటే మట్టి మనిషిలా కనిపించాలన్న మాట. రెండు సీరియల్స్ లోను మీ పాత్ర ఇలాగే ఉంటుందని అన్నారు. మొదటి నుంచి కూడా నేను గ్లామర్ గా కనిపించే పాత్రలే చేస్తూ వచ్చాను. డీ గ్లామర్ గా కనిపించే పాత్రలను నేను చేయలేదు .. అలా చేయడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేశాను. ఆ రెండు సీరియల్స్ ను చేయకపోవడానికి కారణమదే" అని చెప్పుకొచ్చారు.      

  • Error fetching data: Network response was not ok

More Telugu News