Tiger: నల్లమలలో పులుల పోరు... ఓ పెద్దపులి మృతి!

  • శ్రీశైలం అభయారణ్యంలో ఘటన
  • వృద్ధ పులితో పోరాడిన యువపులి
  • తట్టుకోలేక మరణించిన ఓ పులి!

తన పరిధిలోకి వచ్చిన ఓ యువ పెద్దపులిని తరిమికొట్టేందుకు చేసిన ప్రయత్నంలో ఓ వృద్ధపులి మరణించిందని అటవీ అధికారులు వెల్లడించారు. శ్రీశైలం అభయారణ్యం పరిధిలోని వరమామిడి చెరువు ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతం రహదారికి చాలా దూరంలో లోతట్టు అటవీ ప్రాంతంలో ఉందని, అక్కడికి డీఎఫ్ఓ, ఫీల్డ్ ఆఫీసర్, ఎఫ్ఆర్వో తదితరులు వెళ్లి వచ్చారని అధికారులు తెలిపారు.

కాగా, పెద్దపులి అడవిలో అయితే, దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు, జూలో అయితే 20 సంవత్సరాలు జీవిస్తుంది. సుమారు 40 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తన అధీనంలో ఉంచుకునే పెద్ద పులి, ఇతర పులిని తన ప్రాంతంలోకి రానివ్వదు. ఇదే సమయంలో వయసు మీదపడితే, అదే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇతర పులులు ప్రయత్నించి వృద్ధ పులులకు సవాల్ విసురుతుంటాయి. అప్పటికే వేటాడే శక్తి తగ్గి ఆకలితో ఉండే వృద్ధ పులులు, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటుంటాయి. కొన్నిమార్లు యువ పులి పంజా దెబ్బలకు తీవ్రంగా గాయపడి మరణిస్తుంటాయి.

  • Loading...

More Telugu News