Srija: చిరంజీవి తనయ శ్రీజకి వెల్లువెత్తుతున్న పెళ్లి రోజు శుభాకాంక్షలు...ఫొటో వైరల్

  • నేడు శ్రీజ దంపతుల పెళ్లిరోజు...కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల శుభాకాంక్షలు
  • ఆకట్టుకుంటున్న నువ్వే నా బలం అంటూ భర్త కల్యాణ్ దేవ్ చేసిన ట్వీట్
  • కుమార్తె నివృతితో కూడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌

నేడు మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లి రోజు. మార్చి 28, 2016లో ఆమెకు కల్యాణ్ దేవ్‌తో వివాహమయింది. తన పెళ్లి రోజుని పురస్కరించుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. 'పెళ్లిరోజు శుభాకాంక్షలు బావ' అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలోనూ శ్రీజ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కల్యాణ్‌‌తో పాటు తన కుమార్తె నివృతితో శ్రీజ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 'నువ్వే నా బలం...పెళ్లిరోజు శుభాకాంక్షలు' అంటూ భర్త కల్యాణ్ దేవ్ తన భార్యని ఉద్దేశించి చేసిన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ జంటకు తమ వంతుగా విషెస్ చెబుతున్నారు. 

Srija
Kalyan Dhev
Ramcharan
Marriage Anniversary
Sirish Bharadwaj
  • Loading...

More Telugu News